Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- 'మీతో నేను' కార్యాక్రమంలో భాగంగా పర్యటన
నవతెలంగాణ-వికారాబాద్ప్రతినిధి
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 'మీతో నేను' కార్యాక్రమంలో భాగంగా కోట్పల్లి మండలం లోని బార్వాద్తండా, మద్గుల్ తండాల్లో పర్యటించి, గ్రామంలోని సమస్యలు, ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న మిషన్ భగీరథ పైపు లీకేజీలు మరమ్మతులు చేపట్టి, రోడ్డు మధ్యలో ఉన్న మట్టి కుప్పలు తీయాలన్నారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్లను తరచుగా శుభ్రం చేయాలని పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు. ఇండ్లపై ఉన్న కరెంట్ తీగలను వెంటనే తొలగించి, కొత్తగా ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాకుండా డ్రయినేజీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న బావిపై జాలి ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్ర మాలు జరగకుండా తగు చర్యలు తీసుకో వాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే గతంలో పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం తమ గ్రామంలో నూతన కరెంట్ పోల్స్ వేయించి, ఇబ్బంది లేకుండా చేశారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధి కారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.