Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండాలో ట్రాన్స్పార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన
- అభివృద్ధిలో దూసుకపోతున్న తెలంగాణ
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-కోట్‌పల్లి
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నీతో నేను కార్యక్రమం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్ తండా, మద్గుల్ తండాలలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బార్వాద్ తండాలో ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులతో కలిసి గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. తండాలలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీరు అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం బార్వాద్ తండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కొంతమంది పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కవిత మోహన్ సింగ్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మల్ల ఉమాదేవి, పిఎసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనిల్, ఉపసర్పంచ్ బాబునాయక్, మాజీ సర్పంచ్ ప్రసాద్, నాయకులు మహేందర్‌రెడ్డి, రవీందర్ రెడ్డి, పరశురాం నాయక్, దేవిజ నాయక్, గౌరీ శంకర్, జయనందం, దశరథ్ గౌడ్, బందయ్య, మహబూబ్, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.