Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామ పాలకవర్గం, ప్రజల భాగస్వామ్యం, సమిష్టి కృషి వల్లనే అభివృద్ది సాధ్యమవుతుందని ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి అన్నారు. ఉప్పరిగూడ పాలకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివద్ధి పనులకు సంబంధించిన తీర్మాణాలు చేశారు. డ్రైనేజ్, తాగునీటి పైపులైన్ లీకేజీ పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు. అదే విధంగా ఇంకుడుగుంతలు నిర్మించుకున్న బూడిద ఇంద్రమ్మ బాల్‌రెడ్డి ఇంకుడు గుంత పరిశీలించి వారికి రూ.2వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. గతంలో ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి కూడా రూ.2వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు ఉపాధి హామీ నిధులు ద్వారా రావాల్సిన డబ్బులు కూడా త్వరలోనే వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూడిద నరసింహారెడ్డి, వార్డు సభ్యులు మారమని శ్రీనివాస్, బూడిద పద్మమ్మ, బోసుపల్లి శ్రీవేణి, నరకుడి శశిరేఖ, మడుపు అనిత, నడికుడి మహేందర్, కోఆప్షన్ సభ్యులు బోసుపల్లి మమత, మడుపు గోపాల్, పోరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్యదర్శి రిషిక నేత, కారోబార్ నర్సింహ పాల్గొన్నారు.