Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొందుర్గు
కొందుర్గు మండల పరిధిలోని పార్వతాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో గురువారం రాష్ట్ర అబ్కారీ శాఖ ఈఎస్ రవీందర్ రావు పాల్గొన్నారు. సీఐ రామకష్ణ, ఎంపీపీ పోతురాజు జంగయ్యలతో కలిసి ఎంపీటీసీ మంజుల మల్లేష్ గౌడ్ సొంత పొలంలో 1000 ఈత మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఈతమొక్కలను విరివిగా పెంచాన్నారు. అప్పుడే గ్రామస్తులకు స్వచ్ఛమైన ఈతకల్లు లభిస్తుందని తెలిపారు. ఈత మొక్కలను పెంచేందుకు ముందుకు వచ్చిన ఎంపీటీసీ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రామకష్ణ, కొందుర్గు మండల పోలీస్ సిబ్బంది, ఎంపీపీ, ఎంపీడీవో డాక్టర్ ఆంజనేయులు, పార్వతాపూర్ మాజీ సర్పంచ్ కాషా జంగయ్య, కాంగ్రెస్ కొందుర్గు మండల అధ్యక్షులు కష్ణారెడ్డి, లక్ష్మయ్య గౌడ్, రాములు గౌడ్, అశోక్ గౌడ్, అనిల్ గౌడ్, చిన్నయ్య గౌడ్, జనార్దన్‌గౌడ్, డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, విలేజ్ సెక్రెటరీ ఆనంద్ మల్లేష్, వార్డు సభ్యులు, వీఆర్ఏ, తదితరులు పాల్గొన్నారు.