Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
ప్రభుత్వం మున్సిపాలిటీల అభివద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ కృౠషి కృషి చేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో 18 లక్షల రూపాయలతో తాగునీటి సరఫరా, వ్యర్థాల సేకరణ కోసం కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను ఎమ్మెల్యే పూజలు చేసి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మున్సిపాలిటీల అభివద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు అతి సమీపంలో ఉన్న కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మున్ముందు అనేక పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు, వాటర్ మెన్, ఎలక్ట్రీషియన్, సూపర్వైజర్కు ఒక్కొక్కరికి రెండు జతల బట్టలు, చెప్పులు, షూస్, గ్లౌజ్‌లు, రైన్ కోట్ అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్, కొత్తూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్మన్ రవీందర్, మేనేజర్ మంజులత, కౌన్సిలర్లు కమ్మరి జయమ్మ జనార్దన్‌చారి, చింతకింది చంద్రకళ రాజేందర్ గౌడ్, హేమా దేవేందర్, సోమ్లా నాయక్, మాదారం నరసింహ గౌడ్, నాయకులు దేవేందర్ యాదవ్, కమ్మరి జనార్దన్ చారి, బ్యాగరి యాదయ్య, పీర్లగూడెం గోపాల్ గౌడ్, సిటీ కేబుల్ వెంకటేష్, రవినాయక్, రాఘవేందర్‌యాదవ్ పాల్గొన్నారు.