Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి రిజిస్ట్రేషన్ కు డబ్బులు వసూలు లేదంటే నిలిపివేత...
- అదనపు కలెక్టర్‌కు బంట్వారం మండల ప్రాజాప్రతినిధుల వినతి
నవతెలంగాణ-కోట్‌పల్లి
అక్రమాలకు పాల్పడుతున్న బంట్వారం తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని బం ట్వారం మండల ప్రజాప్రతినిధులు కలిసి గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోతి లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్, టీఆర్ఎస్ బంట్వారం మండల అధ్యక్షుడు ఎంపీటీసీ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఏ రిజిస్ట్రేషన్ జరిగినా డబ్బులు తీసుకునే పనులు చేయడం లేదని వారు తెలియజేశారు. రిజిస్ట్రేషన్‌కు దాదాపు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారని లేదంటే ఏదో ఒకటి చెప్పి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తు న్నారని అన్నారు. నూతన పాస్ పుస్తకం లేకుండా ఆన్లైన్లో ఉంటే దాదాపు రూ.30 వేలు ఇస్తే చాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిపారు.ఈ విషయమై మండల ప్రజలు తమ వద్దకు వచ్చి తహసీల్దార్ చేస్తున్న అక్రమాలను వినిపిస్తున్నారని, దీంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, తహసీల్దార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా 'మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి గెటవుట్' అంటూ బెదిరిస్తున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులతోనే ఈ విధంగా వ్యవహరిస్తే సామాన్య ప్రజలతో వివరించే విధానం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, ప్రజలు కూడా తమకు తెలియజేస్తున్నారని చెప్పారు. బస్వపూర్ గ్రామాల్లో సైతం ప్రభుత్వ భూమిలో దళారులు అక్రమంగా ఎర్రరాయి తవ్వుతుంటే వారి వద్ద వసూళ్లకు పాల్పడుతూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారని ఇలాంటివి మండలంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై త్వరలో బయటపెడతామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నర్సింహరెడ్డి, బల్వంత్ రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, మైపాల్ రెడ్డి, కష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.