Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ పల్లె వసంత కృష్ణ గౌడ్
- కొత్తూరు, చిప్పలపల్లి గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు
నవతెలంగాణ-కందుకూరు
తల్లిపాలు అమృతంతో సమానమని సర్పంచ్ పల్లె వసంత కృష్ణగౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తూరు, చిప్పలపల్లి గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ సూపర్వైజర్ యం.అనసూయ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కొత్తూరు గ్రామ అంగన్వాడీ సెంటర్లో పాల్గొన్న సర్పంచ్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. తల్లి, బిడ్డ, ఆరోగ్యంగా ఉండాలంటే, తల్లి ప్రతి రోజు అన్ని ఆకుకూరలు తినాలి అన్నారు. కార్యక్రమంలో కొత్తూరు అంగన్వాడి టీచర్ గోవిందమ్మ, చిప్పలపల్లి అంగన్వాడి టీచర్ రేణుక, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.