Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బషీరాబాద్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో దారుణం జరిగింది. గురువారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో మండలంలో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మొహ్మద్ జుబెర్ (25)ను బషీరాబాద్ పోచమ్మ దేవాలయం సమీపంలో గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఘటన సమాచారం అందుకున్న డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్ఐ విద్యాచరన్రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.