Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీ వాసులకు ఇబ్బందులు
- పట్టించుకోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు
నవతెలంగాణ-గండిపేట్
రోడ్డును కబ్జా చేసి ఇంటిని నిర్మిస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గురువారం నార్సింగి మున్సిపాలిటీలోని 9వ వార్డు వివేకానందనగర్ కాలనీలో ఇంటి ముందున్న రహదారిని కబ్జా చేసి నిర్మాణం చేయడం పట్ల ఆ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషనర్‌కు పలు సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రోడ్డు కబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.