Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేరోస్ మండల అధ్యక్షుడు సన్నీ
నవతెలంగాణ- మర్పల్లి
ఈ నెల 8 న నల్లగొండ జిల్లాలో జరిగే రాజ్యాధికార సంకల్ప సభను పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దామని మర్పల్లి మండల స్వేరోస్ అధ్యక్షుడు ఉదండ సన్నీ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎంతో కషి చేశారని అన్నారు. బహుజన, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల్లోని పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లు తెలిపారు. బహుజన, దళిత, గిరిజనుల రాజకీయ అభివద్ధి, రాజాధికారం కోసం కషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీలోకి అరంగేట్రం చేయాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ గ్రౌండ్లో నిర్వహించే సంకల్ప సభకు భారీ ఎత్తున గ్రామాల నుండి అభిమానులు, నాయకులు కదిలి రావాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మేధావులతో పాటు విద్యార్థి నాయకులంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ ఇండియా మండల అధ్యక్షుడు శ్రీను స్వేరో, ప్రవీణ్, ఎంకే నందు, చాంద్ పాషా స్వేరో, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.