Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గండిపేట్ తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-గండిపేట్
పోలీసులతో ప్రజా ఉద్యమాలను అణిచివేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు భాను ప్రకాష్ అన్నారు. గురువారం గండిపేట్ మండల యువ మోర్చా తరుపున తహసీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ కారులైన శ్రీకాంత చారి ఆత్మాబలిదానంపై నిరసిస్తూ శాంతి యూతంగా యువ మోర్చా తరుపున ఎల్బీనగర్ నుండి కూకట్పల్లి జేఎన్టీయూ వరకు అమరవీరులకు నివాళ్లు అర్పించి ర్యాలీ చేశామన్నారు.ర్యాలీ తీస్తున్న యువమోర్చా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. కేసీఆర్ సర్కారు పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గడిచిన ఏడేండ్ల నుంచి నిరుద్యోగ యువత రోడ్డున పడ్డా కేసీఆర్ సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు చిక్కిరి భిక్షపతి, కార్పొరేషన్ అధ్యక్షులు మహేష్‌యాదవ్, మణికొండ అధ్యక్షుడు బీరప్ప, లక్ష్మీనారాయణ, ఆదిత్యారెడ్డి, శివరాజు, ప్రేంకుమార్, శ్రీశైలం, శివ యాదవ్, నాగేష్‌యాదవ్, చరణ్వాసుచారి పాల్గొన్నారు.