Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్కు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి
- వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు వికారాబాద్ నుంచి బసంత్ ఫంక్షన్ హాల్ మీదగా దన్నారం రోడ్డు నుండి హైదరాబాద్ వెళ్లే ప్రత్యామ్నాయ రోడ్డును గురువారం వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పరిశీలించారు. వికారాబాద్ పట్టణం నుండి హైదరాబాద్ వెళ్లాలంటే ప్రస్తుతం వికారాబాద్, గంగారాం బ్రిడ్జ్ తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదనే విషయం అందరికి తెలిసిందే. దీని కారణంగా బ్రిడ్జిపై ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గం తప్పనిసరిగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వికారాబాద్ పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనుండి బసంత్ ఫంక్షన్ హాల్ మీదుగా రైల్వే ట్రాక్ కింది నుండి దన్నారం గ్రేవ్ యార్డు వరకు వెళ్లే రోడ్డు మార్గాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి చైర్ పర్సన్ మంజుల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే గంగారం బ్రిడ్జ్ తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు. ప్రమాదం జరిగితే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పైగా బ్రిడ్జి రోజురోజుకూ శిథిలావస్థకు చేరుకుంటున్నదని తెలిపారు. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకొనే ఎమ్మెల్యే బ్రిడ్జి పునర్నిర్మించాలని, మరో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో వాయిస్ వినిపించాడని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ రోడ్డును పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ టీపీవో శ్రీధర్, డీఈ బి రామ్ కిషన్, వేణు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రామస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, తదితరులు పాల్గొన్నారు.