Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
వట్టినాగులపల్లి గ్రామంలో ఘనంగా బోనాల సంబురాలను నిర్వహించారు. గురువారం నార్సింగి మున్సిపాలిటీలోని వట్టినాగులపల్లిలో ఉత్సవాలకు నార్సింగి చైర్ పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి, మాజీ సర్పంచ్ స్వరూపనాగేష్యాదవ్, కౌన్సిలర్ యాదమ్మ హాజరయ్యారు. మహిళలు దుర్గమ్మ, పోచమ్మ అమ్మవారికి బోనాలుచెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సాముహికంగా బోనాలతో ఊరేగింపులు, పోతురాజుల నృత్యాలు, శివసత్తులు, కళా ప్రదర్శనలు, డప్పు దరువుల నడమ అమ్మవారికి ముడుపు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేటా ఇదే మాదిరిగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కల్లుశాఖలు, పట్టు వస్త్రాలు. పసుపు, కుంకుమ, కోడిపుంజుల, తోట్టెలను సమర్పించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈసారి వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు అధికంగా పండాలన్నారు. కరోనా నుండి పూర్తిగా విముక్తి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగేష్‌యాదవ్, యువనాయకులు కిషోర్‌యాదవ్, మాజీ వార్డు సభ్యులు విష్ణువర్దన్, ప్రదీప్‌కుమార్, మల్లేష్, సుదర్శన్, చంద్రశేఖర్, గణేష్‌సింగ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.