Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొందుర్గు
షాద్‌నగర్ నుండి పరిగికి వెళ్లే రోడ్డు గుంతలుగా మారుతున్నది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారిలో గుంతలు ఏర్పడంతో గతంలో పలువురు మృతిచెందిన సందర్భాలున్నాయి. నామమాత్రంగా మరమ్మతులు చేపట్టడంతో కొద్ది రోజుల్లోనే గుంతలు ఏర్పడుతున్నాయి. ఇదే రోడ్డున ప్రజానాయకులు, పాలకులు, పాలకవర్గ ఎమ్మెల్యెలు, మంత్రులు, అధికారులు వస్తూ పోతూ ఉన్నా ఈ రోడ్డును పట్టించుకోవట్లేదు. రాంచంద్రపురం వద్ద రోడ్డు గుంతలుగా ఏర్పడటంతో పోలీసులు కూడా పూడ్చిన సందర్భాలు ఉన్నాయి. రాంచంద్రాపూర్-శ్రీరంగాపూర్ మధ్యలో బ్రిడ్జిపైనా గుంతలు ఏర్పడ్డాయి. శ్రీరంగాపూర్ శివారులో షాద్‌నగర్‌కు వెళ్లే దారిలో బ్రిడ్జి వద్ద కూడా గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు బయటికి వచ్చాయి. అదేవిధంగా కొందుర్గు నుండి నావపేటకు వెళ్లే రోడ్డు ఇటీవలే నిర్మించినా బ్రిడ్జి దాటినా తర్వాత మూలమలుపు వద్ద గంగన్నగూడ వై జంక్షన్ వద్ద వర్షాల తాకిడికి బీటీ రోడ్డు కోసుకుపోయింది. గుంతలు కూడా ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఇకపై చేపట్టే నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.