Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నవాతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణంలో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తల్లి పాలతో పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గర్భిణులు, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అవగాహన కల్పించినందుకు చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్, ఐసీడీఎస్ సంయుక్త సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ మోతి, సీడీపీవో లక్ష్మి భారు, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సూపర్ వైజర్ జ్యోతి, చైల్డ్ ఫండ్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి, చైల్డ్ ఫండ్ సీనియర్ ఆఫీసర్ శ్రీశైలం, చైల్డ్ ఫండ్ హెల్త్ కో-ఆర్డినేటర్ దివ్య, రాజీవ్ గహకల్ప వార్డు మెంబరు శ్రీకళ, అంగన్వాడీ టీచర్లు జయప్రియ, మాధవి, లక్ష్మీ, అనురాధ, కనకదుర్గ, మహిళ నాయకురాలు దీపా, కళ్యాణి, సుధారాణి, నాయకులు పట్లోళ్ల నర్సింహారెడ్డి, సాయి, రామచందర్, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.