Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్
- ఎంపీపీ అనిత రవీందర్ గౌడ్
నవతెలంగాణ-తాండూరు రూరల్
గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని ఎంపీపీ అనిత రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అనిత రవి గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు ఎంపీపీ అనితా గౌడ్, జడ్పీటీసీ గౌడి మంజుల, ఎల్మకన్య పీఏసీఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందని, అధికారులూ సహకరించాలని అన్నారు. వ్యవసాయ, కరెంటు అధికారులు ప్రజలు అందుబాటులో ఉండాలన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం అధికారులపైన కఠినంగా వ్యవహరించక పోవడాన్ని ఆసరాగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఆసరా పింఛన్లను 57 ఏండ్ల వారందరికీ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిందన్నారు. కొత్త రేషన్ కార్డు దారులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ సంఘం ఉపాధ్యక్షుడు షంషోద్దీన్, వైస్ ఎంపీపీ స్వరూపారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నరేందర్ రెడ్డి, శాంతయ్య, నర్సమ్మ, వసంతు కుమార్, సుశిలమ్మ, సర్పంచులు రాములు, డి నరేందర్ రెడ్డి, పీ నరేందర్ రెడ్డి, జగదీష్, గోవిందు, విజయలక్ష్మి, కౌసల్యా, సాయిలు, అధికారులు పంచాయతీ రాజ్ డిప్యూటీ డీఈ వెంకట్ రావు, రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ డీఈ శ్రీనివాస్, ఎంఈవో వెంకటయ్య గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజరు, ఎంపపీడీవో సుదర్శన్ రెడ్డి, జిన్గూర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు అపూర్వ రెడ్డి, ఎంపీవో రతన్‌సింగ్, ఏఈలు సంతోష్ కుమార్, సాయి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.