Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ప్రథమ చైర్ చైర్మన్ కంబాలపల్లి భరత్ కుమార్
- దళిత బంధు జీవో జారిపట్ల హర్షం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడని ఇబ్రహీంపట్నం మున్సిపల్ ప్రథమ చైర్ పర్సన్ కంబాలపల్లి భరత్‌కుమార్ అన్నారు. దళిత బంధు పథకం అమలకు జీవో జారి చేసిన సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అందుకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దళతబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుగువేస్తూ జీవో జారీ చేయడం హర్షనీయమన్నారు. దళితుల పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరి నోళ్ళు ముగించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని అమలు చేసి దళితుల ఆరాధ్యదైవంగా నిలిచారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ వాటిని అమలు చేయడంలోనూ దేశాల్లోనే మొదటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని గుర్తు చేశారు. వివిద రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులు వెనక్కి వెళ్తున్న తరుణంలోనూ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులను తీపుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఈ తరుణంలోనూ దళితబంధు పథకం పట్ల దళితుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడంలోనూ ప్రతిపక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు సేకరించి ఇవ్వడమే కాకుండా వెనువెంటనే జీవో జారీ చేసి దళితుల ఆదుకునే క్రమంలోనే ముందడుగు పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, నాయకులు కొండ్రు మహేష్, వనమాల రవిందర్, శివ కుమార్, తరంగ్, శివకుమార్, కిషోర్ పాల్గొన్నారు.