Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అసైన్డ్ భూమి సాగు రైతులకు అందని పథకాలు
- 6 వేల మంది రైతులకు అందని కొత్త పాసు పుస్తకాలు
- ఏండ్ల కొద్ది అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ధరణిలో కనిపించని అప్షన్
- ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన రైతులు
'' మాకు ఊహ తెలియక ముందు నుంచే మా తాతలు, తండ్రులు ఈ భూములను సాగు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ భూముల మీద వస్తున్న ఆదాయంతోనే మా కుటుంబాల జీవనం గడిచింది. గతంలో ప్రభుత్వ మిగులు భూములను జీవనోపాధి కోసం నాడు ప్రభుత్వం పేదలకు అసైన్ చేసిన భూములు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చినవి వాటిని బ్యాంక్లో తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నాం.. కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షళన చేపట్టి కొత్త పాసు పుస్తకాలు జారీ చేసిన క్రమంలో మాకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. మా పేరు మీద భూమి ఉందా..! లేదా అన్న విషయం కూడ తెలవడం లేదు. పాత పాసుపుస్తకాలు బ్యాంక్లో తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు రెన్యూవల్ చేసుకుందామంటే చేసుకునే అవకాశం లేదు. బ్యాంక్ అధికారులు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పాసు పుస్తకాలు ఎప్పుడు వస్తాయే మాకు తెలియదు. మీరు మాత్రం బ్యాంక్ రుణాలు చెల్లించాలని దబాయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు లేదు.. రైతు బీమా లేదు..సబ్సిడీ విత్తనాలు లేవు.. కనీసం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లో విక్రయించడానికి అవకాశం లేదు'' యాచారం మండలం పరిధిలోని సుల్థాన్పూర్, గౌరెల్లి గ్రామాల్లో అసైన్డ్ భూములు సాగు చేస్తున్న రైతులు ఆవేదన.. జిల్లాలో అసైన్డ్ భూములను సాగు చేస్తూ పట్టాలు అందని రైతులను ఎవ్వరిని మందలించిన ఇదే పరిస్థితి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అందరికీ భూమి హక్కులు ఉండాలనే లక్ష్యంగా భూసంస్కరణలు ప్రారంభమయ్యాయి. కౌలుదారులకు రక్షణలు, ఇనాం, జాగీర్లు, సంస్థానాలు లాంటి వ్యవస్థలను రద్దుచేసి దున్నే వారికే భూమిపై హక్కులు కల్పించడం మొదటి తరం భూసంస్కరణలు. రెండోదశలో ప్రభుత్వ, భూదాన భూముల పంపిణీ చేపట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లక్షలాది ఎకరాల పైచిలుకు భూములను పేదలకు అసైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ భూములపై పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2016 సీఎం కేసీఆర్ భూ ప్రక్షళణ చేపట్టి పాత పాస్తు పుస్తకాలు రద్దు చేసి రైతులకు కొత్త పాస్తు పుస్తకాలు ఇచ్చారు. ఇందులో భాగంగా అసైన్డ్ భూములు సాగు చేస్తూ కబ్జాలో ఉన్న రైతులకు కొంత మందికి మాత్రమే నూతన పాసు పుస్తకాలు వచ్చాయి. వివిధ కారణాలతో వేల మంది రైతులను పక్కన పెట్టారు. రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన క్రమంలో స్పందించిన ప్రభుత్వం అర్హులైన వారందరికి పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అసమస్యలు నేటికి పేద రైతులను వేధిస్తున్నాయి.
అసైన్డ్ భూములపై కలెక్టర్లకే సర్వ హక్కులు
రాష్ట్రంలో అసైన్డ్ భూముల సమస్యలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. భూముల ధరలు పెరగడంతో అసైన్డ్ భూములు ఆక్రమాలకు గురవుతున్నయన్న ఉద్దేశంతో ప్రభుత్వం అసైన్డ్ భూముల పర్యవేక్షణలో ఉన్న అసైన్డ్ కమిటీలను 2018లో రద్దు చేసి పూర్తి బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అసైన్డ్ భూములను క్రమబద్ధికరించి అసైన్డ్ భూములు సాగు చేస్తూ కబ్జాలో ఉన్న రైతులందరికి పాసు పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కొంత మందికి మాత్రమే పాసు పుస్తకాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 6వేల మంది రైతుల భూములకు పాసు పుస్తకాలు రావాల్సి ఉందని రైతు సంఘాలు తెలిపాయి. పాసు పుస్తకాలు లేక రైతులకు ప్రభుత్వ ఫలితాలు అందడం లేవని.. రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయడం తప్పడం లేదని రైతు సంఘాలు వాపోతున్నాయి.
అసైన్డ్ భూముల లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం..
జిల్లాలో పేదల అధినంలో ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూములపై సర్వ హక్కులు పేద రైతులకు ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆ భూములపై ఏలాంటి ఆదారాలు లేకుండా చేసింది. ఇదేమంటే ఈ భూములు సాగుకు నిరుపయోగంగా ఉన్నవి. ఈ భూములు మీకు ఉపయోగపడవి ప్రభుత్వ అధికారులు బదులిస్తున్నరని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ భూముల్లో సాగుకు అనుకులంగా ఉన్న వరకు పంటలు పండించామని.. ఈ భూములను బ్యాంక్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నమని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ భూములు మావీ అనడానికి కూడా ఏలాంటి ఆదారాలు లేకుండా ప్రభుత్వం చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా భూమికి అధారాలు లేకుండ చేసిండ్రు
గతంలో రెండున్నర ఎకరాలకు ప్రభుత్వం పాసు పుస్తకాలు ఇచ్చింది. సీఎం కేసీఆర్ భూ ప్రక్షళన చేపట్టిన తర్వత కొత్త పాసు పుస్తకాలు రాలేదు. ఏ రికార్డులో మా పేర్లు కనిపించడం లేవు. ఎన్నోయేండ్లు గీ భూమునే నమ్ముకుని బతుకుతున్నాం. ప్రభుత్వం మా భూమికి పట్టా పాసు పుస్తకాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి
-కందుల లతిత మహిళ రైతు, యాచారం మండలం, సుల్థాన్పూర్
పేదల భూములకు పట్టాలు ఇవ్వాలి
ఎన్నో ఏండ్లుగా ఆసైన్డ్ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులందరికి పట్టాలు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలు పొందిన ప్రతి రైతుకూ కొత్త పాసుపుస్తకాలు అందించాలి. కొత్త పాసు పుస్తకాలు అందకపోవడంతో రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఫలితాలు అందడం లేదు. పంట పెట్టుబడి, బీమా లాంటి సౌకర్యలు లేక ఆసైన్డ్ భూములు సాగు చేస్తున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న తక్షణమే ప్రభుత్వం సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలి..
-శ్రీకాంత్ రెడ్డి కిసాన్ సెల్ రంగారెడ్డి జిల్లా నాయకులు