Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ జాటొత్ నర్మదాలచ్చిరాం, జడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్రెడ్డి
నవతెలంగాణ-మంచాల
గొర్రెల కాపరులు ప్రతి గొర్రెకూ తప్పనిసరిగా నట్టల నివారణ మందులు వేయాలని ఎంపీపీ జాటొత్ నర్మదలచ్చిరాం, జడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నోముల గ్రామంలో గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు.అనంరతం వారు మాట్లాడుతూ గొర్రెలకు సీజనల్ వ్యాధ్యులు నివారించేందుకు ముందస్తుగా నట్టల నివారణ మందులు వేయాలని గొర్రెకాపరులకు సూచించారు.కార్యక్రమంలో సర్పంచ్ పల్లాటి బాల్ రాజ్, ఎంపీటీసీ పల్లాటి జయనందము, పశువైద్యాధికారులు, వార్డు సభ్యుడు కసరమోని హనుమంతు, నాయకులు పల్లాటి జంగయ్య, పల్లాటి యాదగిరి, పల్లాటి కుమార్, నల్ల భారత్, కసరమొని మల్లేష్, గొల్ల కురుమలు తదితరులు ఉన్నారు.
కొడంగల్ లో..
జీవాల పెంపకందారులు తప్పనిసరిగా ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల మందును తప్పనిసరిగా జీవాలకు తాగించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ పరమేష్ తెలిపారు. మండలంలోని కస్తూరిపల్లి, ఇంధనూర్, పర్సపూర్, కొడంగల్ల్లో గొర్రెలకు, మేకలకు శుక్రవారం నట్టల మందు వేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు కచ్చితంగా వేయించుకుని నట్టల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నట్టల మందు సకాలంలో వేయించకపోతే పశువులలో నట్టలుండి, రక్తాన్ని పీల్చి పశువుని బక్కచిక్కేవిధంగా తయారు చేస్తా యన్నారు. చివరికి గొర్రెలు, మేకలు నీరసించి మృత్యువాత పడుతాయని తెలిపారు. జీవాల పెంపకదారులు అందరూ తప్పకుండా మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు.
యాచారం లో.. నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెల కాపర్లు అన్ని విధాల సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాష సూచించారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని సింగారంలో గొర్రెలకు నట్టల నివారణ మందును ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వర్షాకాలంలో గొర్రె లకు, మేకలకు అంటు వ్యాధులు రాకుండా పశువైద్యుల సల హాలు, సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి వనజ కుమారి, సర్పంచ్ వన వాడ అరుణ పాండురంగారెడ్డి, ఉప సర్పంచి, గొర్రెల కాపర్లు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేయించాలని చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణా రడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారు శైలజా రెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ శిరీష అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని చేవెళ్ల, కుమ్మెర, న్యాలట, సింగప్పగూడ తదితర గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగిం చుకోవాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో టీకాలు వేయనున్నట్టు తెలిపారు. రైతులు దగ్గరుండి తమ గొర్రెలు, మేకలకు వ్యాధి నివారణ టీకాలు వేయించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.