Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండావాసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డికు వినతి
నవతెలంగాణ-పెద్దేముల్
పెద్దేముల్ మండల పరిధిలోని రచ్చకట్ట తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని తండావాసులు శుక్రవారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అ గ్రామంలో 480 మంది జనాభా ఉన్నారనీ, 86 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. పాత గ్రామ పంచాయతీకి మూడు కిలోమీటర్లు దూరంలో ఉండి అభివృద్ధికి నోచుకోని గిరిజన తండాను నోచుకోలే దన్నారు. తమ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయనీ, గతంలో కొత్త గ్రామపంచాయతీలు చేసినప్పుడు తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా చేయకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 11 గ్రామ పంచాయతీలతో తట్టేపల్లి మండలం ఏర్పాటు అవుతున్న తరు ణంలో రచ్చకట్ట తండాను గ్రామ పంచా యతీగా ఏర్పాటు చేసి, 12 గ్రామపంచాయతీలతో తట్టేపల్లి మండలం ఏర్పాటు చేయాలనీ కోరారు. అలాగే జైరాంతండా,ఎర్రగడ్డ తండాలను కొత్త రెవెన్యూ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలనీ వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా, రెెవెన్యూ గ్రామాల ఏర్పాటుతో పాటు, కొత్తగా అవుతున్న తట్టేపల్లి మండంలో రెవెన్యూ గ్రామాలు ఏడు నంచి, తొమ్మిదికి పెంచాలని కోరారు. కార్యక్ర మంలో సేవ్య నాయక్, లక్ష్మణ్, బిక్కు, రాంశెట్టి, గోబీర్యా, సునీల్, రాంకిషన్ లు తదితరులు పాల్గొన్నారు.