Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన ప్రతి ఒక్కరికీి పింఛన్లు, రేషన్‌కార్డులు
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
నవతెలంగా-తాండూరు
విడతలవారిగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం చింతామణి పట్నం గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణం, పర్వతపూర్ గ్రామంలో సీసీ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విడతలవారిగా గ్రామాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులు ద్వారా పనులు కొనసాగుతున్నాయన్నారు. అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన రేషన్‌కార్డులు, పింఛన్లు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ లాల్ రెడ్డి, చింతామణిపట్నం గ్రామ సర్పంచ్ విమలమ్మ, జడ్పీటీసీ జోడీ మంజుల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామ్‌దాసు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రామలింగారెడ్డి, పటేల్ ఉమాశంకర్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శకుంతల, గౌతాపూర్ ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ సంతోష్‌కుమార్, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షులు రాములు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ మల్లప్ప, ఉప సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు గోవింద్, సర్పంచ్‌లు సాయిలు, జగదీష్, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేణుగౌడ్, అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.