Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ గోడు వెల్లబోసుకున్న బాధితులు
నవతెలంగాణ-నవాబ్‌పేట్
రూ. కోటీ విలువ చేసే భూమిని స్వాహా చేసిన సంఘటన నవాబ్ పేట్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం తిమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అనంత్ రెడ్డి తండ్రి బుచ్చయ్య వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు అంజమ్మ, చిన్న కూతురు బుచ్చమ్మ. కుమారుడు బుచ్చిరెడ్డి పెద్ద కూతురు. పైండ్ల అంజమ్మ 40 సంవత్సరాల క్రితం దేవరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కూతురు భర్తను వదిలేసి వారి తల్లిదండ్రుల స్వగ్రామమైన తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తోంది. కూతురు బతుకుదెరువు కోసం తన తండ్రి అనంత్‌రెడ్డి 418సర్వే నెంబర్ నందు 2.06 గుంటల భూమిని తన కూతురు పేరు మీద 1994 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అట్టి భూమిని అనంత్ రెడ్డి రెండవ కూతురు మహాలింగపూరం(దోబిపేట్) గ్రామం శంకర్ పల్లి మండలం, రంగారెడ్డి జిల్లాకు గండు బుచ్చమ్మ వారి భర్త బుజంగ్ రెడ్డిలు రైతుబంధు ఇప్పిస్తానంటూ నమ్మించి తీసుకెళ్లి మోసపూరితంగా తన పైన ఉన్నటువంటి రెండెకరాల ఆరుగంటల భూమిని(అక్రమ) రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని బాధితురాలు అంజమ్మ ఆరోపించారు. తనను నమ్మించి మోసం చేసి అక్రమ భూ బదలాయింపు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ బుచ్చయ్యకు, నవాబ్‌పేట ఎస్ఐ వెంకటేషంకి ఫిర్యాదు చేశారు. న్యాయం జరగని యెడల మరణమే తనకు శరణ్యమని బాధితురాలు అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.