Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా గ్రామంలో నెలకొన్న నీటి కొరత తీర్చాలని కోరుతూ శుక్రవారం మియాపూర్ బీజేపీ డివిజన్ కార్యవర్గం సభ్యులు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మక్త విలేజ్‌లోని ఎస్సీ బస్తీలో కొన్ని రోజుల నుండి బోర్ పాడవడం వల్ల అక్కడి ప్రజలు నీటి కొరకై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం పై ఫిర్యాదు చేశారు. ఈ బోర్ ను వెంటనే మరమ్మతు చేసి నీటి సమస్య తీర్చాలని వినతిపత్రంలో కోరారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కొత్త పైప్‌లైన్‌ను కూడా మంజూరు చేయాలని కోరారు. సంబంధిత అధికారులను పంపించి సమస్యపరిష్కారానికి కషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మనోహర్, హఫీజ్ పేట్ అధ్యక్షుడు శ్రీధర్, గుండె గణేష్ ముదిరాజ్, రవి గౌడ్, లక్ష్మణ్, రామకష్ణ, అశోక్, విజేందర్, అంజయ్య, రమేష్, శేఖర్, స్థానికులు పాల్గొన్నారు.