Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ అమత సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభించే సలహాలు-సూచనలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ కౌన్సిలర్ అమత సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జీఎంఆర్ ఫౌండేషన్ సహకారంతో ఎయిర్పోర్ట్ కాలనీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ అమత మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజపు ఏర్పాటే అంగన్వాడీ కేంద్రాల లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివద్ధికి తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఐసీడీఎస్ మహేశ్వరం ప్రాజెక్టు ఆఫీసర్ సరిత మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుంచి 7 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు, తల్లి ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డకు వెయ్యి రోజులు తల్లిపాలు ఇస్తే వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులను మహిళలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి మనోహర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంధ్యారాణి, సరళ, అనురాధ పాల్గొన్నారు.