Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నేటి సమాజానికి జయశంకర్ మార్గదర్శకులని ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి అన్నారు. ఉప్పరిగూడలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అదే విధంగా దళితవాడలో సందర్శన చేస్తూ అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ, సీసీరోడ్ల పునర్నిర్మాణం ఎలక్ట్రికల్ స్తంభాలను పరిశీలించి కొత్తవి వేయాలని సూచించారు. అనంతరం ఇంకుడు గుంతల, ఛాలెంజ్‌లో భాగంగా బోసుపల్లి నందకుమార్ కొత్త ఇల్లు నిర్మాణానికి ఇంకుడు గుంత తీసి నందుకు గాను ప్రోత్సాహకంగా రూ.2వేల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నరసింహా రెడ్డి, వార్డు సభ్యులు బోస్పల్లి శ్రీవాణి, నరకుడి శశిరేఖ, మడుపు అనిత, కో-ఆప్షన్ సభ్యులు బోసుపల్లి మమత, మడుపు గోపాల్, పోరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో...
పొప్రెసర్ జయశంకర్ జయంతిని పురష్కరించుకుని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు
పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. నాలుగు కోట్ల ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.