Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన్ సాహస్ స్వచ్ఛంద సంస్థ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్
- జన్ సాహస్ సేవలు అభినందనీయం
- ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్, జెడ్పీటీసీ రాందాస్ నాయక్
నవతెలంగాణ-కుల్కచర్ల
జన్ సాహస్ సచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు జన్ సాహస్ స్వచ్ఛంధ సంస్థ జాతీయ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ అన్నారు. శుక్రవారం చౌడపూర్ మండలం చౌడాపూర్, గొరిగడ్డ తండాలలో జన్ సాహస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన్ సాహస్ సంస్ధ జాతీయ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, ఎంపీపీ సత్యహరిచంద్ర, జడ్పీటీసీ రాందాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలు, వలస కూలీల కుటుంబాలకు సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఇవి కాకుండా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్డు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు సంస్థ నిర్వహిస్తుందని వివరించారు. జన్ సాహస్ సంస్థ వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్ జెడ్పీటీసీ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సంస్థ జిల్లా వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సంస్థ ద్వారా కార్మికులను గుర్తించి వారికి లేబర్ కార్డు పొందేందుకు కషి చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో జన్ సాహస్ సంస్ధ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పీరం పల్లి రాజు, ఎంపీటీసీ శంకర్, పిఎన్ పీఎస్ అధ్యక్షులు రాఘవేందర్‌గౌడ్, వార్డు సభ్యులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.