Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇ.పట్నం ఎంపీపీ పి.కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దళిత బస్తీల అభివృద్ధికి రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ అన్నారు.జయశంకర్ జయంతిని పురష్కరించుకుని మండల పరిధిలోని చర్లపటేల్గూడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా దళితుల జీవితాల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకం అమలులోకి తీసుకొచ్చాడన్నారు. అనాగరిక కాలం నుండి ఈనాటి నాగరికత కాలం దాకా వెనకబడ్డ జాతులకు స్వయం ఉపాధి పథకాల ద్వారా అభివద్ధి పరచాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దళితుల అభివృద్ధికి దోహదం చేస్తారన్నారు. అంతేకాకుండా నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని దళితవాడలో ప్రభుత్వ పరంగా పూర్తిగా సర్వే చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపైన దళితవాడలో వారం రోజుల పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు చేసిందన్నారు. అలాగే గ్రామంలో సీసీరోడ్డు ప్రారంభించారు. అంగన్వాడీ భవనం మంజూరుకు రూ.10లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్ బాబు, సర్పంచ్ గీతారాంరెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు.