Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
వాణిజ్య సముదాయాల ముందు అక్రమంగా రోడ్డు ఆక్రమించుకుని నిర్మించిన రేకుల షెడ్డు లను షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘు నేతత్వంలో శుక్రవారం కూల్చివేశారు. మండలంలోని ఈముల్ నర్వ గ్రామంలో దుకాణాల ముందు అక్రమంగా రేకుల షెడ్యూలు నిర్మించడంతో రోడ్డు కుచించుకుపోయి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామ సర్పంచ్ అజరు మిట్టు నాయక్ తో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అక్రమకట్టడాల కూల్చివేత లో దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా సహకరించడంతో వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుకాణాల ముందు అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించారని దీంతో రోడ్డు కుచించుకుపోయి తరచుగా ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు గుర్తు చేశారు. ఇటీవల కేశంపేట మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా పూలు అమ్ముకోవడానికి వచ్చి టిప్పర్ లారీ కింద పడి మత్యువాత పడ్డాడు. సమీపంలో ప్రతిష్టాత్మకమైన హజ్రత్ పీర్ జహంగీర్ పీర్ దర్గా ఉండడంతో ఇక్కడికి ప్రతి గురు శుక్ర ఆది వారం రోజులలో వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారని, దీంతో ఆయా ప్రత్యేక రోజుల్లో రోడ్డు పూర్తిగా రద్దీగా ఉండి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు అన్నాను. ఇక మీదట దుకాణ యజమానులు ఎవరు కూడా దుకాణాల ముందు రేకుల షెడ్డు నిర్మించకుండా గ్రామ పంచాయతీకి సహకరించాలని వారు కోరారు.