Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
గొర్రెలు, మేకల కాపరులు ఆర్థికంగా అభివద్ధి చెందాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం కేశంపేట మండలం కొత్తపేటలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీవాలను రక్షించేందుకు ప్రతి యేటా ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశు సంపద పెంపునకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గండ్ర జగదీశ్వర్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, సర్పంచులు వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్, ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, సీనియర్ నాయకులు శేఖర్ పంతులు, జగన్ రెడ్డి, లక్ష్మయ్య, మారం శేఖర్‌రెడ్డి, వేణుగోపాల్ చారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.