Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్ (మాదాపూర్)
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ అన్నారు. పేద మహిళలకు చేయూతనిచ్చేందుకు మాదాపూర్ డివిజన్ పరిధిలోని కష్ణ కాలనీకి చెందిన తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం సభ్యులు లక్ష్మీ, శివలీల, మెర్సీ, సువర్ణ, లక్ష్మీ, కవితలకు ఎమ్మెల్యే గాంధీ తన సొంత డబ్బులతో కుట్టు మిషన్లను ఏర్పాటు చేశారు. సోమవారం మిషన్లను తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి అందించి, సెంటర్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని అన్నారు. ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ను సద్వినియోగం చేసుకొని స్వశక్తితో ఎదగాలన్నారు. మహిళా శక్తి ప్రపంచంలో చాలా గొప్పదని తెలిపారు. ఇష్టమైన వత్తిలో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ప్రతి రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. మున్ముందు ఇంకా అభివృద్ధిలోకి రావాలని సూచించారు. రాబోయే రోజుల్లో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత శిక్షణకు వచ్చిన వారు పట్టుదలతో నేర్చుకుని కొత్త కొత్త డిజైన్లను తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, కష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కష్ణ యాదవ్, వార్డ్ సభ్యులు రహీమ్, యూత్ నాయకులు ఖాజా, తెలంగాణ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ, మహిళ నాయకురాలు రాణి, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు ఉమాదేవి, లక్ష్మీ, మాధవి, భాగ్యమ్మ, ఊర్మిల, కవిత, సవితా బేగం, కుమారి, మల్లమ్మ, దీప మిత్ర నాయక్, సాయా సింగ్, తదితరులు పాల్గొన్నారు.