Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా మన్నె కవిత నారాయణ ఎంపికయ్యారు. గత మార్కెట్ కమిటీ చైర్మన్ రామకష్ణారెడ్డి పదవీకాలం ముగియడంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నూతన కమిటీ ఎంపికలో భాగంగా మహిళలకు అవకాశం కల్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ పాలక మండలిలో రెండు పర్యాయాలు మహిళలకు అవకాశం కల్పించడం విశేషం. రామకష్ణా రెడ్డి కంటే ముందు యాదమ్మ చైర్ పర్సన్ గా విధులు నిర్వహించగా తాజాగా మరోమారు ఉద్యమ నేత మన్నే నారాయణ యాదవ్ సతీమణి కవితను ఎంపిక చేశారు. ఉద్యమంలో పనిచేసిన నాయకులకు ఎమ్మెల్యే సముచిత స్థానం కల్పించారంటూ ఉద్యమకారులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రుల సమక్షంలో నేడు ప్రమాణ స్వీకారం...
షాద్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్ గా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు.
నూతన పాలక మండలి సభ్యులు వీరే....
షాద్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలిలో మొత్తం14మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో చైర్పర్సన్ గా మన్నే కవిత, వైస్ చైర్మన్ గా టి.నారాయణరెడ్డి, సభ్యులుగా జాంగారి నర్సింలు, ఎర్రం రాజరామేశ్వర్ రెడ్డి, కటిక యాదయ్య, యాదయ్య గౌడ్, కే.బాలు, ఆశమోని కష్ణయ్య, రవి ప్రకాష్, కే బాలు, మున్సిపల్ చైర్మన్ నరేందర్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్, ఏడీఏ రాజారత్నం, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని మార్కెట్ యార్డ్ సెక్రటరీ తెలిపారు.