Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
వచ్చే ఏడాది 2022 మార్చి వరకు తాండూర్‌లో కొనసాగుతున్న మంచన్‌పల్లి, కందనెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆర్ అండ్‌బీ శాఖ ఈఈ లాల్ సింగ్ అన్నారు. మంగళవారం తాండూరు నియోజకవర్గంలోని మంచన్‌పల్లి, కందనెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయంలో నవతెలంగాణతో మాట్లాడుతూ నియోజకవర్గంలో బ్రిడ్జి నిర్మాణం పనులు 60 శాతం పూర్తి అయ్యాయన్నారు. రూ.15 కోట్ల 30 లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో అన్ని అభివద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అధిక వర్షాల కారణంగా రోడ్లు దెబ్బ తిన్నాయన్నారు. తాండూరు-వికారాబాద్ రోడ్డును రానున్న రోజుల్లో మరింత బాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెండింగ్ పనులన్నింటిని వెంటనే పరిష్కరించి రోడ్డును బాగు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఈ శ్రీనివాస్ ఆర్ అండ్ బీ శాఖ అధికారులు పాల్గొన్నారు.