Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
మండల కేంద్రంలో14 ఫైనాన్స్ నిధులతో కొనసా గుతున్న అండర్ డ్రయినేజీ నిర్మాణ పనులను మంగళవా రం ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల ఆస్పత్రి నుంచి కోట మర్పల్లి ఎక్స్ రోడ్డు వరకు 10లక్షల రూపాయలతో గ్రామపంచాయతీ తరపున చేపడుతున్న అండర్ డ్రయినేజీ నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. పనులు ముమ్మ రంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీవో సోమలింగం, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, కృష్ణ, తదితరులు ఉన్నారు.