Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ అరెస్టులపై కాంగ్రెస్, బీజేపీ, ప్రజాసంఘాల నేతల ఫైర్..
నవతెలంగాణ -షాద్నగర్ రూరల్
మంత్రుల పర్యటనలు ఎక్కడ ఉన్నా కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు, అసలు అరెస్టు చేయాల్సింది సీఎం కేసీఆర్నని కాంగ్రెస్ నాయకులు బాబర్ఖాన్, బాల్ రాజ్ గౌడ్, చెన్నయ్య, బీజేపీ నేతలు చెట్ల వెంకటేష్, వంశీకష్ణ, ఎమ్మార్పీఎస్ నేతలు పెంటనోళ్ల నర్సింలు, బాల్రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలో భాగంగా బుధవారం ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ షాద్నగర్ పోలీసులు అరెస్టులు చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి గెలిచాక విస్మరిస్తున్న సీఎం కేసీఆర్ను ముందుగా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల కోసం స్వరాష్ట్రంలోనే మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వ పాలన బాగుంటే పాలకులను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్ముందు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు ఆందోళనలు ఉంటాయని తెలిపారు.