Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- కొలువుదీరిన షాద్‌నగర్ మార్కెట్ కమిటీ పాలకమండలి
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మార్కెట్ యార్డులో మార్కెట్ పాలకమండలి సమావేవం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభివాణిదేవీ తదితరులు హాజరయ్యారు. పాలకమండలి చైర్‌పర్సన్‌గా మన్నే కవితానారాయణ యాదవ్, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు.
షాద్‌నగర్ మార్కెట్ కమిటీ పాలకమండలి..
చైర్‌పర్సన్‌గా మన్నే కవిత, వైస్ చైర్మన్ గా టి.నారాయణరెడ్డి, సభ్యులుగా జాంగారి నర్సింలు, ఎర్రం రాజరామేశ్వర్ రెడ్డి, కటిక యాదయ్య, యాదయ్యగౌడ్, కే.బాలు, ఆశమోని కృష్ణయ్య, రవి ప్రకాష్, కే. బాలులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీల ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీలు వెంకట్ రాంరెడ్డి, శ్రీలత, విశాల శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సర్వర్ పాషా, కృష్ణవేణి, నాయకులు లక్ష్మీ నరసింహ రెడ్డి, నారాయణరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.