Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ పౌసుమి బసు విసృతంగా పర్యటించారు.శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, నర్సరీలను పరిశీలించారు.పల్లె ప్రకృతి వనం బాగుందన్నారు. నర్సరీలో ఉన్న మొక్కలను ప్రభుత్వ భూముల్లో నాటాలని అధికారులను సూచించారు. అనతంరం కలెక్టర్ మాట్లాడుతూ అనంతరం గ్రామంలోని దళితవాడలో విసృతంగా పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. మురుగు కాలువ పరిశుభ్రత, ఇంటింటా చెత్త సేకరణ చేపట్టి గ్రామాన్ని దోమలు ప్రబలకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయా లన్నారు. గ్రామంలో స్వచ్ఛ భరత్ క్రింద నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు వినియోగించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తపరిచారు. కొందరు మరుగుదొడ్లును స్టోర్ రూములుగా మార్చుకోవాడంపై తీవ్రంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకుని విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు. కిరాణా షాప్ వారు ప్లాస్టిక్ వ్యర్థాలను, మురుగు కాలువలో వేసినందుకు రూ.వేయ్యిల జరిమానా విదించారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న రెండు గృహాలను కూల్చి వేయాలనీ, నిరూప యోగంగా ఉన్న పాత బావులను పూడ్చివేయాలని అధి కారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో రిజ్వానా, పీఆర్డీఈ లక్ష్మణ్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, తహసీల్దార్ హారదీప్ సింగ్, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, కార్యదర్శి పరేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.