Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెమిన్‌పేట
మండలకేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మానిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ నాయకులు విమలక్క, బుచ్చి రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీధర్‌రెడ్డి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమిం పజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మారెడ్డి, మహిపాల్, సంగారెడ్డి, నరసింహారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.