Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-దోమ
కేసీఆర్ ప్రకటించిన దళితబంధును స్వాగతిస్తున్నామని అలాగే రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ బేషరతుగా బీసీ బంధు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం పరిగిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కష్ణయ్య మాట్లాడారు. బీసీల అభివద్ధిపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు చట్ట సభల్లో సరైన రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రకటించే పథకాలను జనాలు నమ్మే స్థితిలో లేరని సూచించారు. ఇప్పటికైనా బీసీల హక్కుల కోసం బీసీలు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ విద్యార్థులకు విద్య, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే పూర్తిగా చెల్లించాలన్నారు. మెస్ చార్జీలు, ఇతర చార్జీలనూ చెల్లించాలని అన్నారు. చట్ట సభల్లో బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోకపోతే మిలిటెంట్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్. కష్ణయ్య సమక్షంలో నాయకులు జిల్లా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కష్ణ, బీసీ నాయకులు హనుమంతు ముదిరాజ్, రాము యాదవ్, చిన్న నర్సింహులు, ఆంజనేయులు, జ్యోతి లింగం, తదితరులు పాల్గొన్నారు.