Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
షాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో దొంగతనం జరిగిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎంపీ డీఓ అనురాధ తెలిపిన వివరాల మేరకు గురువారం సా యంత్రం 8గంటల వరకు విధులు నిర్వహించిన అధికారు లు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి యథావిధిగా వెళ్లిపోయారు. ఎంపీడీవో భవనంపై నుంచి లోపలికి దిగిన దొంగలు, సూపరిండెంట్ ఛాంబర్ నుంచి ఎంపీడీవో గది తాళాలు తీసుకుని, తాళం తీసి గదిలోకి ప్రవేశించారు. ఆ గదిలోని బీరువాను పగులగొట్టి అందులో రికార్డులను చిందరవందర గా పడేశారు. మళ్లీ యథావిధిగా గదికి తాళం వేసి పరారయ్యారు. శుక్రవారం ఉదయం పది గంట లకు కార్యాలయానికి వచ్చిన అధికారులు, బీరువా తాళం పగలగొట్టడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి షాబాద్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ అశోక్ చేరుకొని ఆధారాలను సేకరిం చారు. దొంగలు ఎలాంటి వస్తువులు ఎక్కువగా వెళ్లలేదని కేవలం కార్డులను చిందరవందర చేసి వెళ్లారని తెలిపారు. దొంగతనం జరిగిన గదిని పరిశీలించిన షాబాద్ జడ్పీటీసీ అవినాష్‌రెడ్డి.. నిందితులను త్వరగా పట్టుకొని శిక్షించాలని పోలీసులకు సూచించారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులతో అన్నారు.