Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఆగస్టు 15 సందర్భంగా శుక్రవారం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కే పురం హరిజన బస్తీలో ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీవైఎఫ్ఐ జిల్లా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతూ, అందరికి విద్య, ఉద్యో గం ఉపాధి కల్పించాలని ఆందోళన పోరాటాలు నిర్వహి స్తుందని తెలిపారు. నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన ముగ్గుల కార్యక్రమంలో 23 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులను ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ సీనియర్ నాయకులు బంగారు నర్సింగరావు, జిల్లా నాయకులు నరేష్, నేరేడ్మెట్ డివిజన్ డీవైఎఫ్ఐ కన్వీనర్ జూపాక వైష్ణవి, ఎస్.నాగమణి, లలిత, సత్యవతి, బి.సరిత, కల్పన, స్నేహలత, ప్రియా, శివాని, మధు, తదితరులు పాల్గొన్నారు.