Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
- పోలీసుల ఆధ్వర్యంలో కడ్తాల్లో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-ఆమనగల్
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్లో ఆమనగల్ సర్కిల్ పరిధిలోని కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరై మాట్లాడారు. పోలీసులు ప్రజారోగ్య సంబంధిత కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన శిబిరంలో కడ్తాల్ మండలంతో పాటు ఆయా మండలాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్యూల్యమైన తమ రక్తాన్ని దానం చేసినట్టు సీఐ జాల ఉపేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ధర్మేష్, హరిశంకర్ గౌడ్, వరప్రసాద్, జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, రేఖ్యా తాండా సర్పంచ్ హరిచంద్ నాయక్, జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి, వాసుదేవ్ పూర్ ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్ నాయక్, రావిచేడ్ సర్పంచ్ భారతమ్మ విఠలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఉపసర్పంచులు రామకృష్ణ, వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు కంబాలపల్లి పరమేష్, మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.