Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇ.పట్నం ఎంపీపీ కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్ అన్నారు. మండల పరిధిలోని తులేకాలనన్లో డ్వాక్రా భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. అదే విధంగా మహిళలు సంఘాలుగా ఏర్పడిన దాదాపు 20 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రగతి సాధించారని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం రెండో స్థానంలో నిలిచిందన్నారు. మండల పరిషత్ నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మండలంలో అన్ని సంఘాలకు కలిపి దాదాపు రూ.30కోట్ల మేర రుణాలు అందజేయనున్నట్టు తెలిపారు. పల్లెప్రకృతి వనం, శ్మశానాలకు ప్రభుత్వం నీటి వసతి కల్పించనున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ సురేష్ రెడ్డి, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి భాస్కర్, ఉపసర్పంచ్ యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.