Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి పెట్టాలనీ మండల విద్యాధికారి హరిచందర్ పేర్కొన్నారు. సోమ వారం మండల పరిధిలోని పలుగుతాండ, కుమ్మరికుంటా తండా, బుద్లాపూర్, హుస్సేన్ నాయక్ తండా పాఠశా లను సందర్శించారు. ఆన్లైన్ విద్య బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కరోనా జాగ్త్రతలు పాటిస్తూ విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆన్లైన్ తరగుతులపై వివరించారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే ఉపాధ్యా యులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. అనం తరం బుద్లాపూర్ గ్రామ సభలో పాల్గొని విద్యార్థుల ఆన్ లైన్ క్లాస్‌లపై విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు చే శారు. తర్వాత బుద్లాపూర్ చౌరస్తాలో కొంతమంది విద్యా ర్థులతో ఆన్లైన్ క్లాస్‌ల గురించి చర్చింరాఉ. ఈ కార్యక్రమంలో బుద్లాపూర్ సర్పంచ్ మరోని బారు పాం డు నాయక్, కిష్టాపూర్ కాంప్లెక్స్ సీఆర్పీ రెడ్యానా యక్, బుద్లాపూర్ గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.