Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ. కోటీ 85 లక్షలతో అభివద్ధి పనులు చేపట్టిన జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
కరోనా కష్టకాలంలో విశేష సేవా కార్యక్రమాలు
గ్రామీణ క్రీడాకారులకూ ప్రోత్సాహం
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండలాన్ని అన్నివిధాలా అభివద్ధి పర్చేందుకు తనవంతు కషి చేస్తున్నానని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఇటీవల తన పదవి కాలం రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చేపడుతున్న పలు అభివద్ధి, సేవా కార్యక్రమాల నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ-ఆమనగల్
జడ్పీటీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు మండలంలో కోటి ఎనభై అయిదు లక్షల రూపాయలతో అభివద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్ తెలిపారు. అందులో ముఖ్యంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, మట్టిరోడ్లకు మరమ్మతులు చేయించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు.
నాలుగు వేల మంది డ్రైవర్లకు చేయూత..
మండలానికి చెందిన లారీ, ట్రాక్టర్, కారు, ఆటో, స్కూల్స్ వ్యాన్ డ్రైవర్లు దాదాపు నాలుగు వేల మంది కరోనా కారణంగా రోడ్డున పడ్డటంతో వారికి చేయూతనిచ్చారు. రూ.22 లక్షలు విలువ చేసే బియ్యం, వివిధ రకాల నిత్యావసర వస్తువులను ప్రతి గ్రామంలో పంపిణీ చేశారు. సెకండ్ వేవ్‌లోనూ 500 మంది బాధిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి రూ.1500 విలువ చేసే బియ్యం, గుడ్లు శానిటైజర్లు, మాస్కులు అందజేశామన్నారు. సీఎం, మంత్రులు, జడ్పీ చైర్ పర్సన్ ప్రసంగాలతో ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రచార రథాన్ని కూడా ఏర్పాటు చేసి రెండు నెలలు గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించారు.
మతుల కుటుంబాలకు..
ప్రమాదాల్లో, అనారోగ్యంతో మతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి అయిదు వేలకు తగ్గకుండా ఆర్థికసాయం అందించడం. అదేవిధంగా పిడుగు పాటు, విద్యుత్ తదితర ప్రమాదాలలో మతి చెందిన పాడి పశువుల రైతులను పరామర్శించి వారికి తక్షణ సహాయం అందించి ప్రభుత్వ పరంగా నష్ట పరిహారం అందేలా ఆయన కషి చేస్తున్నారు.
కుమారుని జ్ఞాపకార్థం ట్రస్ట్..
ఏడాది కింద మతి చెందిన కుమారుని జ్ఞాపకార్థం అతని పేరుతో రాధాకష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరం అవుతున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కషి చేస్తున్నారు. ట్రస్ట్ ద్వారా వివిధ రకాల టోర్నమెంట్ లు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు.
అదేవిధంగా తుల్జాభవాని ఆలయాల నిర్మాణానికి తనవంతు సాయంగా పల్లెచెల్క తాండాకు రూ.లక్ష, కొర్షకొండ తండాకు రూ.లక్ష, సాలార్పూర్కు సమీపంలో సేవాలాల్, మేరమయాడి ఆలయాల ఏర్పాటుకు కావలసిన భూమి కొనుగోలుకు లక్ష రూపాయలు, గడ్డమీదితండాలో కంకాళి ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు, రావిచేడ్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయానికి యాభై వేలు, ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి ఆలయాల మరమ్మతులకు 150 సిమెంట్ బస్తాలు అందజేశారు. అదేవిధంగా త్వరలో స్థానిక గిరిజనుల సహకారంతో మండల కేంద్రములో సేవాలాల్ మహారాజ్, గిరిజనుల కులదేవత మేరమయాడి (జగదాంబ) ఆలయాల నిర్మాణానికి కషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు..
నూతనంగా ఏర్పడిన కడ్తాల్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కషి చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మండల ప్రజా పరిషత్, తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, శాసన సభ్యులు జైపాల్ యాదవ్, ఎంపీ రాములు సహకారంతో మండలానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి అన్నివిధాలా అభివద్ధి పర్చేందుకు తనవంతు కషి చేస్తున్నట్టు జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు.