Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ కలెక్టర్ కె.నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్కలెక్టరేట్
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామాలు, పల్లె ప్రకతి వానల పనులను వేగవంతం చేసి ఈ నెల వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక డీపీఆర్సీ భవనంలో పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనుల పురోగతిపై స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పల్లెప్రకతి వనాల వద్ద మొక్కలు నాటి గ్రీన్ ఫెన్సింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాలన్నారు, అలాగే అన్నింటికీ నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. పల్లె ప్రకతి లేని గ్రామాలకు స్థల సేకరణ వారం రోజులలో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. బహత్ పల్లె ప్రకతి వనాల కొసం కూడా పది ఎకరాలకు తగ్గకుండా స్థలం సేకరించాలన్నారు. గ్రామం ప్రధాన రహదారులకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద మంచి మొక్కలు నాటి గ్రామాల రూపు రేఖలు మారిపోయేలా చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా రెండు వరసలలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలనీ సూచించారు. అవసరమైన నిధులు గ్రామ పంచాయతీ గ్రీన్ బడ్జెట్ను వినియోగించుకోవాలని తెలిపారు. ఇప్పటికే పూర్తి కావలసిన పనులు పూర్తి కాకపోవాడంపై అసంతప్తి వ్యక్తపరిచారు. చేపట్టిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఆర్డీఓ కష్ణన్, డీపీవో రిజ్వానా, డీఎఫ్ఓ వేణుమాధవ్ లతో పాటు స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.