Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలోని 363, 364, 365, 368, 377, 377, 382, 386, 389 గల సర్వే నెంబర్లో హౌం ల్యాండ్ డెవలప్ మెంట్ నిబంధనలకు విరుద్ధంగా అతిపెద్ద ప్రహారీ గోడ నిర్మాణం చేపడుతున్నారు. అయినప్పటికి స్ధానిక మున్సిపాలిటీ
అధికారులు హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. కానీ రియల్ వ్యాపారి ఇచ్చే తాయిలాలకు ఆలవాటు పడి నిబంధనలకు తూట్లు పోడుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. వీళ్లు చేసే వెంచర్లు, లేవుట్లల్లో జరిగే తప్పిదాలను గుర్తించే పరిస్థితిలో ప్రజలు లేకపోవడంతో అమాయకత్వాన్ని వ్యాపారులు సోమ్ముగా చేసుకుంటున్నారు. అదే పద్దతిలో రంగారెడ్డి జిల్లా అదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది సర్వే నెంబర్లల్లో 84 ఎకరాల స్థలంలో లేవుట్ చేస్తున్నారు. 3,09,910 గజాల స్థలంలో ప్లాట్లు చేసేందుకు హౌం ల్యాండ్ డవలపర్స్ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే భారీ ప్రహారీ గోడ వెంచర్‌కు చూట్టు నిర్మాణం సాగించారు. అయితే ఈ వెంచర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో సర్వీస్ రోడ్డు ఉంది. ఆ సర్వీస్ రోడ్డు పక్కనే సెట్ బ్యాక్ పాటిం చకుండా అను మతులు
తీసుకోని ప్లాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వెంచర్‌కు దక్షణ భాగంలో ఇప్పటికి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పక్కన ఉండే రైతులు వ్యవసాయం చేసేటప్పుడు ఏలాంటి ప్రహారీ గోడలు నిర్మణా చేయోద్దు. ఈ నిర్మాణంతో రైతు సాగు చేసుకోవడానికి సమస్యలు వస్తాయి. ఈ విధంగా లాభాల కోసం ఆశించి లేవుట్లు చేసే రియల్ వ్యాపారులతో ఓపక్క రైతు సమస్య మరో పక్క అతి పెద్ద రోడ్డు ఉండటంతో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇవేవీ లేకుండానే రియల్ వ్యాపారులు సంబంధిత అధికారులను మ్యానేజ్ చేసి కాలం గడుపుతూ ఉంటారు.
భూమి చదును కోసం మట్టి తరలింపు...
భారీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసే లేవుట్ భూమిని చదును చేస్తున్నారు. అయితే ఈ చదును చేయడంలో భాగంగా ఎత్తు పల్లాలను లేవలింగ్ చేసేందుకు మట్టిని మరోక చోటకు తరలిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద గుంతలు తీసీ మట్టిని ఇతర లేవుట్లకు తరలించి లేవలింగ్ చేస్తున్నారు. మట్టిని తరలించాలంటే తప్పనిసరిగా స్ధానిక రెవెన్యూ, జిల్లా మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ అలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా మట్టి తరలిస్తున్నారు. అక్రమంగా రూపోందించిన లేవుట్లల్లో ప్లాట్లు చేసి విక్రయాలు జరిపితే అధికారులు పట్టించుకోరు. అమాయక ప్రజలను మోసం చేస్తే స్పందించారు. ఆకర్షణీయమైన మాటలు, డ్రాయింగ్ బొమ్మలతో బ్రోచర్లను ప్రచురించి కొనుగోలుదారులకు వల వేస్తారు. దీంతో ఆ రియల్ ఏస్టేట్ చూపించే తాయిళాలకు ఆలవాటు పడి అధికారులు చేప్పంది చేస్తారు.
సర్వీస్ రోడ్డుకు సెట్ బ్యాక్ ఏదీ...?
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుమతులిచ్చే హెచ్ఎండీఏ అధికారులే అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉంటే ఎమీ చేయాలో తెలియాదా..? లేకపోతే తెలిసి కూడా తమకేందుకు ఇ గోడవ అని వదిలేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపుల రహదారులు నిర్మించారు. ఈ రహదారికి సుమారు 50 ఫీట్ల దూరం తర్వాతనే నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఆ అధికారులే రియల్ వ్యాపారులకు వత్తాసు పలికి ఇలా చేయకు... మరోలా సెట్ చేరు అంటూ సలహాలు సూచనలు చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులకు కడుపు నిండుతుందోమో గానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందోస్తు ప్రణాళికలో భాగంగానే సెట్ బ్యాక్ చేస్తారు. కానీ సెట్ బ్యాక్ చేయడంతో నష్టపోతామని రియల్ వ్యాపారులు విక్రయాలు జరుపుతున్నారు. రోడ్డుకు సమీపంలోనే బఫర్ జోన్ వదలకుండా ప్రహరీ గోడలు పూర్తి చేశారు అధికారుల కళ్ళు కప్పేందుకు ప్రహరీ గోడ లోపల మరో నిర్మాణాన్ని చేపడుతున్నారు హెచ్ఎండిఏ అధికారులు చేత పర్యటన చేస్తున్న సందర్భంగా లోన నిర్మించిన తాత్కాలిక గోడలను ధ్వంసం చేసి ఫైనల్ అప్లోడ్ కాపీ వచ్చిన తర్వాత విక్రయించుకునే అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎండిఏకు సమర్పించిన డ్రాప్డ్ కాఫీలో మాత్రం గ్రీనరీ కోసం ఏర్పాటు చేస్తున్నట్టుగా రెడ్ మార్క్ పెట్టి సమర్పించారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలను విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నాయి.
అడిగితేనే ద్వంసం
అక్రమ కట్టడాలు యదేచ్చగా సాగుతున్నాయి. అడిగితేనే కూల్చడాలు.. అన్నచందంగా మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులు వ్యవహరిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు మరిచారు. కండ్ల ముందే కట్టడాలు జరుగుతున్న పట్టడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారుల కళ్ళకు అక్రమ కట్టడాలు కనిపించడం లేదా? అవినీతిలో కురుకు పోయారా? అని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తమ పరిధి కాదంటూ మునిసిపల్ అధికారులు ముఖం చాటేస్తున్నారు. దాంతో రియాల్టర్లు భారీ ప్రహరీ గోడల నిర్మాణాలకు చేపడుతున్నారు. బఫర్ జోన్ కూడా వదలడం లేదు. దాంతో రియాల్టర్లు కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. హౌమ్ ల్యాండ్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డ సైతం తమ ఆధీనంలో కలిపేసుకుంటున్నారు. సర్వీస్ రోడ్డుకు ఆనుకుని బారే కట్టడం చేపట్టారు. అయినా అయినా హెచ్ఎండీఏ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు
తమ పరిధి కాదు మున్సిపల్ అధికారులు
ఆదిభట్ల మున్సిపాలిటీలో బఫర్ జోన్‌కు వదలకుండా ప్రహరీ గోడలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమ పరిధి కాదని హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని తప్పించుకుంటున్నారు. దాంతో మున్సిపల్ అధికారులతో ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా పట్టించుకోవడం లేదు. వ్యాపారుల సైతం లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.
అక్రమంగా మట్టి తరలింపు
సదరు వెంచర్లో భూమి చదును పేరుతో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. సుమారు 84 ఎకరాల విస్తీర్ణంలో ఔటర్ సర్వీసు రోడ్డు వెంట భారీ ప్రహరీ గోడ నిర్మించారు. ఆ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. భూమి చదును పేరుతో భారీ స్థాయిలో రాత్రి వేళల్లో జేసీబీ, ఇటాచ్చీ, టిప్పర్లతో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అందుకు మైనింగ్ శాఖ నుంచి మట్టి తవ్వకానికి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలాంటి అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి మైనింగ్ సెస్సు కూడా రాకుండా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టరేట్‌కు ఈ ప్రాంతం నుంచే వెళుతున్నప్పటికీ మైనింగ్ అధికారులకు మాత్రం కనిపించడం లేదు.
నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు : హెచ్ఎండీఏ అధికారి దామోదర్ నాయక్
నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవు. డ్రాప్ట్ అనుమతి ఉంది. కానీ నిబంధనల మేరకు మాత్రమే అభివృద్ధి చేసుకోవచ్చు. అంతకు మించి వ్యవహరిస్తే ఫైనల్ అనుమతులు ఉండబోవు. డ్రాప్ట్‌లో ఉన్న విధంగా నిర్మాణాలు జరుపుకోవాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.