Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్
- శెట్టిపల్లి, ముద్విన్ గ్రామాల మధ్య రోడ్డుకు మరమ్మతులు
నవతెలంగాణ-ఆమనగల్
మట్టి రోడ్డు మరమ్మతు పనులను నాణ్యతగా చేప ట్టాలని జిల్లా సాంఘీక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్ సూ చిచారు. మండలంలోని శెట్టిపల్లి, గౌరారం, ముద్విన్ గ్రామాల మధ్య ఉన్న మట్టి రోడ్డుకు మరమ్మతు పనులను శనివారం మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, శెట్టిపల్లి సర్పంచ్ ఎగి రిశెట్టి గోదాదేవి సత్యం, ఎంపీటీసీ సభ్యులు నిట్ట మంగమ్మ నారాయణ, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ తదితరులతో కలిసి జెడ్పీటీసీ అనురాధ పత్య నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తన జెడ్పీ నిధుల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి చేపడుతున్న రోడ్డు మరమ్మతు పనులను నాణ్యతగా చేప ట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిట రింగ్ జిల్లా కమిటీ సభ్యులు నేనావత్ పత్య నాయక్, ఉప సర్పంచ్లు వినోద్, వెంకటేష్, వెంకటయ్య, రమేష్, రమేష్ నాయక్, కాలె విక్రమ్, శివ, వినోద్ రెడ్డి, దినేష్ కుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.