Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి డిపో డీఎం పవిత్ర
నవతెలంగాణ-దోమ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల వద్దకు ఆర్టీసీ బస్సులతో మెరుగైన సేవలు కల్పిస్తుందని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యలకు చేరుకోవాలని పరిగి డిపో డీఎం పవిత్ర అన్నారు. శనివా రం దోమ మండల కేంద్రంలోనీ బస్‌స్టాండ్ ఆవరణలో దోమ సర్పంచ్ రాజిరెడ్డి అధ్యక్షతన గ్రామస్తులకు, ప్రయా ణికులకు ఆర్టీసీ సేవలపై కళా బృందంచే అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూరా లను దగ్గర జేస్తూ మీ అవసరాలకు ఆసరాగా 90 ఏళ్ళుగా సురక్షిత సేవలు అందిస్తూ మీ మనసులు గెలుచుకున్న టీఎస్ ఆర్టీసీ సంస్థ అని తెలిపారు. ప్రజా జీవితంలో ప్రధా న భాగమైన ప్రజా రవాణా సంస్థ అని పేర్కొన్నారు. అనం తరం దోమ నుండి ఐనపూర్ గ్రామం మీదుగా మహబూబ్ నగర్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని సర్పంచ్ రాజిరెడ్డి డిఎం పవిత్ర తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య మైన ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ వారిచే అదనపు బస్సులు నడిపించబడుననీ, 30 కంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతా నికి వేళ్ళే వారుంటే మీరు ఉన్న ప్రాంతానికే బస్సు పంపిం స్తామని తెలిపారు. అలాగే హైద్రాబాద్, సికింద్రాబాద్‌లో హౌం డెలివరి సౌకర్యం కలదనీ, అతి తక్కువ ధరకే వేగంగా భద్రంగా పార్సెల్ చేయబడుననీ తెలిపారు. ఆర్టీసీ వారు అందిస్తున్న కార్గో సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, కళా బృందం సంపత్, ఏడిసి కృష్ణ రెడ్డి, టీఐ సోమ్లా, కార్గో ఇన్చార్జి విశ్వనాథ్ గౌడ్, వార్డ్ మెంబెర్స్ లక్ష్మణ్, వసంత్‌రావు, డప్పు రమేష్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.