Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండల జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ స్థాపించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు యువత ఆకర్శితులౌ తున్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాల్లో తామూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆమనగల్ ప్రాంతానికి చెందిన ఉప్పల వెంకటేష్ ప్రధాన అనుచరుడు నాగిళ్ళ జగన్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని మంగ ళపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో తామూ భాగస్వాములు అవుతామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ తాను స్థాపించిన ఉప్పల చారి టబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా కల్వ కుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న సేవా కార్యక్ర మాలను మరింత విస్తృత పరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, యువ నాయకులు మహేష్, వెంకటేష్, రామ స్వామి, గణేష్, పవన్ కళ్యాణ్, సతీష్, వి.వెంకటేష్, శివ, మల్లేష్, శ్రీకాంత్, వంశీ, శ్రీను, శ్రీశైలం, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇండ్ల నిర్మాణ పనులు
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు యజ్ఞంలా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తలకొండపల్లి మండలంలోని వెల్జా ల్ గ్రామానికి చెందిన గుంత చెన్నమ్మ ఇంటి నిర్మాణానికి కావలసిన ఇటుక ఇసుక సిమెంట్ తదితర వాటిని సమ కూర్చినట్టు ఎంపీటీసీ సభ్యులు మల్కేడి అంబాజీ, ఉప సర్పంచ్ ఎంఏ అజీజ్ తెలిపారు. గ్రామంలో నిరుపేద కుటుం బాల కోసం నిర్మిస్తున్న 50 ఇండ్ల నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని వారు పేర్కొన్నారు.