Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామస్తులు, సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- శిఖం భూమి అన్యాక్రాంతం అయినట్టు నిర్ధారణ
- భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశాలు
- పట్టించుకోని స్థానిక రెవెన్యూ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నవతెలంగాణ-షాద్‌నగర్
మేక గూడశివారులోని సర్వేనెంబర్ 886 తుంగ కుంట చెరువు 9 ఎకరాలు 28 గుంటలకు ప్రస్తుతం 3 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో కలెక్టర్‌కు, జిల్లా రెవెన్యూ అధికా రులకు, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికా రులు స్పందించి భూమి కొలిచి కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అన్యాక్రాంతమైందని తేల్చేశారు. తిరిగి భూ మిని స్వాధీనం చేసుకోవాలని, ప్రస్తుతం తుంగకుంట చెరువును నాట్కో ఫార్మా లిమిటెడ్ ఖరీదు చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించారని, ప్రస్తుతం అందులో కాంపౌండ్ వాల్ నిమిత్తం పిల్లర్ల నిర్మాణం చేపట్టగ గ్రామస్తులు చేసిన ఫిర్యాదులకు అధికారులు ఇరిగేషన్‌శాఖ యంత్రాంగం పరి శీలించి అక్రమ నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించారు. రం గారెడ్డి జిల్లా కలెక్టర్ సైతం అక్రమ నిర్మాణం ఉన్నట్లయితే తొలగించాలని స్థానిక ఆర్డిఓ ఎమ్మార్వో, ఇరిగేషన్ అధికా రులకు సంబంధిత పత్రాల ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కానీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెక్కినట్టు వ్యవ హరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించాల్సి న అధికారులు భూ బకాసురులు ఇచ్చే ఆమ్యామాలకు అల వాటుపడి ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.